కృష్ణా: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భీమవరం వాస్తవ్యులు ఆకులు వీరాస్వామి రాజా – పద్మజ దంపతులు రూ.1,00,116 విరాళముగా సమర్పించారు. ఈ విరాళాన్ని నిత్యాన్నదాన పథకానికి వినియోగించాలని కోరుతూ ఈ మొత్తాన్ని దేవస్థానం సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు అందచేశారు.