గుంటూరు: తెనాలిలో వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న పార్టీ శ్రేణులు ABN-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, చంద్రబాబు మెప్పుకోసం ఎంతకైనా దిగజారుతారా అని శివకుమార్ ప్రశ్నించారు.