TPT: చంద్రగిరి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం జరుగుతుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.516 టికెట్‌తో పాల్గొనవచ్చు. టికెట్లు 14 నుంచి ఆలయం వద్ద లభ్యం కానున్నాయి.