ASR: పాడేరు మండలం మినుములూరు పీహెచ్సీని డీఎంహెచ్వో డాక్టర్ జమాల్ భాషా గురువారం తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. అనంతరం పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డులు పరిశీలించారు. ఆసుపత్రిలో నిల్వ ఉన్న మందులు పరిశీలించారు. పీహెచ్సీలో సుఖ ప్రసవాలు అధికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.