CTR: గర్భిణీలు ప్రసవ సమయంలో మరణించకుండా నివారణ చర్యలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అమలాపురంలోని కలెక్టరేట్లో మాతా శిశు మరణాల రేటు, ప్రసవ సమయంలో గర్భిణీల మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రసవ సమయంలో సుమారు 5 గర్భిణీలు ఇటీవల మరణించినట్లు గుర్తించామన్నారు.