యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో గురువారం కట్టుపాలెం గ్రామంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారామచంద్రల విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. ఈనెల 26న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెళ్లి రాట వేశారు. నవమి రోజున సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.