»Accident To Kodali Nani Convoy Incident Near Durgamma Temple
Kodali Nani: కొడాలి నాని కాన్వాయ్‌కు ప్రమాదం..దుర్గమ్మ ఆలయం దగ్గర ఘటన
కొడాలి నానికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఆయన విజయవాడ దుర్గమ్మ ఆలయానికి కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఆయన కారు బారికేడ్లను ఢీకొంది.
ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) కాన్వాయ్కి పెను ప్రమాదం తప్పింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం కొడాలి నాని కుటుంబ సమేతంగా వెళ్లారు. దుర్గమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లే క్రమంలో వినాయకుడి గుడి వద్ద సిమెంట్ బారికేడ్‌ను కొడాలి కారు ఢీకొంది. ఒక్కసారిగా కారు బారికేడ్‌ను ఢీకొనడంతో అక్కడున్నవారంతా ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలేవీ కాలేదు.
ప్రమాదం జరిగిన కారులోనే కొడాలి నాని, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. చిన్న ప్రమాదం కావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం తర్వాత అదే కారులోనే నాని గుడికి వెళ్లినట్లుగా కార్యకర్తలు తెలిపారు. ఈ ప్రమాదంపై వైసీపీ (YCP) నేతలు ఆందోళన చెందారు. కొడాలికి ఫోన్ చేసి ప్రమాద వివరాలను (Accident) అడిగి తెలుసుకున్నారు.
కొడాలి నాని (Kodali Nani) మేనకోడలి వివాహం గురువారం కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్లో వేడుకగా జరిగింది. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ వివాహ కార్యక్రమం తర్వాత కుటుంబ సభ్యులతో కొడాలి నాని దుర్గమ్మ గుడికి (Durga Temple) వెళ్లగా అక్కడే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.