KRNL: నందవరం(మం) నాగలదిన్నెలో నిర్మించనున్న అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి MLA డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. దేవాలయ నిర్మాణం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ పాల్గొన్నారు.