SKLM: రణస్థలం మండల విద్యాశాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గట్టు శ్రీరాములుకు ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమ్మెల్యేను కలుసుకునేందుకు ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో గురుపూజోత్సవం సందర్భంగా గురువులను గౌరవించుకోవాలని, ఈ క్రమంలోని ఆయనకు సత్కరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.