శ్రీకాకుళం పేరు వినగానే రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాగా పేరుగాంచింది. దీనికి కారణం ప్రధానంగా అభివృద్ధికి నోచుకోకపోవడమే. అయితే శ్రీకాకుళం ఎందరో మహనీయులు, కవులు, సినీ ప్రముఖులు, నిర్మాతలకు పుట్టినిల్లు. ఇక్కడ దేశంలో అత్యంత పురాతనమైన ఆలయాలు వెలసిన పుణ్యభూమి. ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీకూర్మం కూర్మనాథుడు, అరసవల్లి ఆదిత్యుడు ప్రముఖ ఆలయాలతో విరాజిల్లుతోంది.