ELR: అటవీ, వన్యప్రాణుల రక్షణకు అధునాతన సాంకేతికతను వాడుతూ శుక్రవారం ఏలూరు అటవీ డివిజన్ పరిధిలో “హనుమాన్” మొబైల్ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సందీప్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణలో 32 మంది సిబ్బంది ప్రత్యక్షంగా హాజరుకాగా, మిగిలిన వారు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. యాప్ పనితీరుపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు.