NDL: ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి ఆత్మకూరు పట్టణంలోని మార్కస్, మహమ్మదీయ మసీదుల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలతో కలిసి ఆయన భోజనం చేశారు.