SKLM: పీఎం రాహత్ పథకానికి సంబంధించి పోష్టర్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు పొందిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా రూ.1,50,000ల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారన్నారు.