KDP: అట్లూరు ఎస్సైగా నాగ కీర్తన ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎస్సైల బదిలీలలో భాగంగా రాజుపాలెం స్టేషన్లో ట్రైనీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగ కీర్తన అట్లూరుకు వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.