NTR :విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం సరస్వతీ యాగం వైభవంగా జరిగింది. ఫాల్గుణ బహుళ నవమి, మూల నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో పాత చండీ యాగశాలలో అర్చకులు హోమాలు నిర్వహించారు. విద్యార్థుల విద్యా విజయం, జ్ఞానాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.