W.G: ఆకివీడులో జాతీయ రహదారిపై ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. పెదపేటలోని రామాలయం విషయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన వారంతా ఆందోళనకు సిద్ధమయ్యారని ముందస్తు సమాచారంతో జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆటోల్లో వెళుతున్న వారి వివరాలు సేకరించారు.