ప్రకాశం: మొంథా తుఫాను నేపథ్యంలో ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్తీకమాసం సోమవారం సందర్భంగా కొత్తపట్నం, మడనూరు, ఈతముక్కల, పాకల, ఊళ్ళపాలెం, కనపర్తి బీచ్‌లకు ప్రజలు ఎవరూ సముద్ర స్నానాలకు రావద్దని కోరారు. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా అవసరం ఉంటే తమను సంప్రదించాలని సూచించారు.