సత్యసాయి: ‘సాయిరాం’ అనే మాటతో శ్రీ సత్యసాయిబాబా స్ఫూర్తితో 1960లో ప్రారంభమైన సాయి సేవాదళ్ ప్రపంచానికి నిస్వార్థ సేవకు నిదర్శనం. ఐఏఎస్లు, డాక్టర్లు సహా ఏ హోదావారైనా ఇక్కడ సాధారణ కార్యకర్తల్లా పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరు విపత్తుల సమయంలో, ప్రశాంతి నిలయంలో ప్రేమతో, చిరునవ్వుతో సేవ చేస్తారు.