కృష్ణా: ఇండిగో ఎయిర్లైన్స్ కార్యకలాపాలలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విమానాల రద్దు, ప్రణాళికలు దెబ్బతిన్న నేపథ్యంలో, పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి విమానాశ్రయ అధికారులు అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేశామని బుధవారం తెలిపారు.