తూ.గో: గోకవరం ఆర్టీసీ డిపో నుండి పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలంకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు గోకవరం డిపో మేనేజర్ సుచరిత మార్గరేట్ శనివారం తెలిపారు. ఈనెల 9 నుండి 13వ తేదీ వరకు ఈ బస్సు సర్వీసులు నడుపుతామని, విజయవాడ,, శ్రీకాళహస్తి తిరుపతి విష్ణుకంచి, శివకంచి మీదుగా అరుణాచలం వెళ్తుందన్నారు. బస్ టికెట్ రూ. 4600 ఉంటుందని తెలిపారు.