AKP: పాయకరావుపేట లింగాల కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాళ్ల వరహాల బాబు ఆదివారం సొంత నిధులతో దానిని జేసీబీతో పడగొట్టించారు. ఇక్కడ కొత్త భవనం నిర్మాణానికి హోం మంత్రి వంగలపూడి అనిత నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే కొత్త భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.