అనంతపురం: గుత్తి మాజీ ఫుట్బాల్ ప్లేయర్, విశ్రాంత డ్రిల్ ఉపాధ్యాయుడు చార్లీ విజయం ఆదివారం రాత్రి మృతి చెందారు. గుత్తిలో ఆయన ఎంతోమందిని ఫుట్బాల్ క్రీడాకారులను తయారు చేశారు. ప్రస్తుతం చార్లీ విజయం రిటైడ్ అయ్యి తాడిపత్రిలో నివాసం ఉంటున్నారు. చార్లీ విజయం మృతికి పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన అంత్యక్రియలు తాడిపత్రిలో జరుగుతాయన్నారు.