VSP: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిరోజూ రెండు గంటలు కృషి చేయాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. విశాఖలోని ఎ ఏస్ రాజా మహిళా జూనియర్ కళాశాలలో హరిత నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి చుట్టూ ఆకుకూరలు, కూరగాయలు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. కాసు పాల్గొన్నారు.