KDP: సిద్దవటం మండలాన్ని రాయచోటిలో కలుపుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ పైన సిద్దవటం JAC సభ్యులు మండిపడ్డారు. ఆదివారం సిద్దవటంలోని ZPHS పాఠశాలలో సమావేశమై కార్యాచరణ రూపొందించారు. సోమవారం మండలంలోని ప్రజలు స్వచ్చందంగా కడప జిల్లా కలెక్టరు గారికి ఎవరి అభిప్రాయాలు వారు అర్జీ రూపంలో రాసి కలెక్టర్కు అందచేయాలని పిలుపునిచ్చారు.