VZM: బొడ్డవరలో జిందాల్ భూ కేటాయింపుల్లో అవకతవకలు చోటుచేసుకుందని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆరోపించారు. రికార్డుల్లో అడవిగా ఉన్న భూములు రిజిస్ట్రేషనుకు వచ్చే సరికి జిందాల్ కంపెనీ పేరు ఉందన్నారు. చీడిపాలెంలో సర్వేనెంబరు 11లో ఉన్న 142.5 ఎకరాలు భూమి రికార్డుల ప్రకారం నేటికీ అడవి కింద నమోదై ఉందని, ఈ భూమిని జిందాల్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధమన్నారు.