NTR: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నది వరద ప్రవాహాన్ని ఆర్డీవో చైతన్య, తహశీల్దార్ వెంకటేశ్వర్లుతో కలిసి గురువారం పరిశీలించారు. ఎగువన వర్షాల కారణంగా భారీగా వరద నీరు వస్తున్నందున, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆర్డీవో ఆదేశించారు.