PLD: GDCCB బ్యాంక్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి వ్యాఖ్యలను గురువారం తీవ్రంగా ఖండించారు. తాను చదివిన డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్ను ప్రదర్శించారు. ‘మీలా దొంగ సర్టిఫికెట్లు తీసుకోలేదు, మీదేంటో చూపండి’ అని సవాల్ విసిరారు. ఐదేళ్లలో బొల్లా చేసిన అభివృద్ధి ఏంటని ఆయన ప్రశ్నించారు.