KRNL: క్రీడకారులకు తగిన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని మంగళవారం కోరారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టి క్రీడాకారులకు దాని నుంచి ఎలాంటి లబ్ధి చేకూర్చలే అని పేర్కొన్నారు. అలాగే క్రీడాకారులకు తగిన శిక్షకులను మనం అందుబాటులో తేవాలని సూచించారు.