ప్రకాశం: జిల్లా పరిషత్ యాజమాన్యం కింద మిగిలి ఉన్న హెచ్ఎం పోస్టులకు సోమవారం ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఉద్యోగన్నతుల కౌన్సిలింగ్లో మిగిలి ఉన్న మూడు పోస్టులతోపాటు, రెండు రిటైర్మెంట్ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. కావున సీనియార్టీ జాబితాలో 141 నెంబర్ తర్వాత నుండి అందరూ హాజరుకావాలన్నారు.