ELR: ఏలూరు నగరంలోని క్రాంతి కళ్యాణమండపంలో బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు సంస్కరణలు ఎంతో ఆదర్శనీయమని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వాలంబన సాధించడమే బీజేపీ లక్ష్యం అన్నారు.