ప్రకాశం: పెద్ద దోర్నాల మండలంలో శ్రీశైలం రహదారిలోని పెద్దమూల మలుపు వద్ద గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆవుల లాలయ్య అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో లాలయ్యకు గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.