HYD: ఖైరతాబాద్ మహాగణపతిని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ హరిచందన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు పోలీసులకు, అధికారులకు సహకరించాలని కోరారు.