VSP: మధురవాడలో కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని 99 పైసలకు కేటాయించేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ విశాఖలో రూ.1,582 కోట్ల పెట్టుబడి పెట్టి, దశలవారీగా 8 వేల ఉద్యోగాలు కల్పించనుంది. 2026 జూన్‌లో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా క్యాంపస్ ప్రారంభిస్తారు. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయి.