ELR: నూజివీడులో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు ఆర్డీవో వినూత్న, డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ స్థానిక మొగల్ చెరువు వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తుపాను ముప్పు నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, ముందస్తు చర్యలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.