VZM: ఎస్.కోట, కొత్తవలస, వేపాడ మండలాలలో 16.71 కిలోమీటర్ల మేర నూతన రోడ్డుకు రూ 9.28 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసినట్లు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలకు ధన్యవాదములు తెలిపారు.