ATP: డీఎంహెచ్ ఓ కార్యాలయంలో ఈ నెల 6 నుంచి రెండు రోజుల పాటు జనరల్ నర్సింగ్ ఆఫ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ.బీ దేవి శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 17 పారా మెడికల్ కళాశాలల్లో జీఎన్ఎం కోర్సును అభ్యసించడానికి 761 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.