ప్రకాశం: రేషన్ పంపిణీలో అక్రమ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని హనుమంతునిపాడు మండల టీడీపీ అధ్యక్షులు సాని కొమ్ము తిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని హనుమంతాపురం, తిమ్మారెడ్డిపల్లి పంచాయతీలో మంగళవారం స్మార్ట్ ఫ్యాషన్ కార్డులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ముక్కు నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.