GNT: తెనాలి నుంచి పినపాడు గ్యాస్ గోడౌన్ మీదుగా యడ్లపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైపోయింది. రోడ్డుపై భారీ గుంతలు పడటం, ఇరువైపులా కోతకు గురికావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. యడ్లపల్లి,వలివేరు,చుండూరు గ్రామాలకు ఇది షార్ట్కట్ కావడంతో నిత్యం రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు వెంటనే స్పందించి కొత్త రోడ్డు నిర్మించాలని స్థానికులు,వాహనదారులు కోరుతున్నారు.