సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో పోక్సో చట్టం, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాలికలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని, 16 నుంచి 18 ఏళ్ల పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.