TPT: శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి బదిలీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఈవోని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా ఏర్పడిన ఆలయ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయి, ఈవోకి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ విషయాన్ని ఛైర్మన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు.