గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ లాలాపేట పాత బస్టాండ్ సెంటర్లో ఇక్బాల్ మసీదు పునర్నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు, హజ్ యాత్రికుల కోసం విజయవాడలో భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.