ప్రకాశం: కనిగిరి మండలంలో 15వ నంబరు రేషన్ దుకాణం నుంచి 8 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆటోలో బియ్యాన్ని తరలిస్తుండగా స్థానిక సీపీఎం నాయకులు అడ్డుకొని అధికారులకు సమాచారం అందించారు. డీలర్ అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించి, అతనిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.