ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ తులసిల రఘురాం, జిల్లా వైసీపీ నేతలు పరిశీలించారు. ఏర్పాట్లపై పోలీసులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10:40 గంటలకు జగన్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారని వైసీపీ నేతలు తెలిపారు. అనంతరం రోడ్డు మార్గాన పాపిరెడ్డిపల్లెకి వెళ్తారు.