VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-1లో పీఎం సూర్య ఘర్ యోజనపై ఇంటింటికి అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని అవసరమైన విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని వివరించార.