SS: సోమందేపల్లి(మం) నల్లగొండ్రాయునిపల్లి క్రాసింగ్ వద్ద ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి అధికారులు సోమవారం రోడ్డు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా క్రాసింగ్ వద్ద మార్కింగ్ నిర్వహించి, ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు ఫ్లైఓవర్ ఎత్తు, రోడ్డు వెడల్పు, వాహన రాకపోకలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు.