ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు 11 గంటలకు పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి కొలతలు వేసిన అధికారులు.. నేడు మరోసారి కొలతలు వేయనున్నారు.