GNTR: శుక్రవారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్, అధికారులతో కలిసి పాత గుంటూరులో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వం పాలనలో అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం పాలన అంతా అభివృద్ధితో సాగుతుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.