ASR: కొయ్యూరు మండలం చిట్టెంపాడు సచివాలయాన్ని శుక్రవారం ఎంపీడీవో బాలమురళికృష్ణ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు గురించి కార్యదర్శి రాంబాబును అడిగి తెలుసుకున్నారు. తరువాత డౌనూరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. డౌనూరు పీహెచ్సీని సందర్శించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.