మణిపూర్లో 2023లో అల్లర్లు తలెత్తిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటనను మణిపూర్ ప్రధాన కార్యదర్శి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.7,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అల్లర్ల తర్వాత ప్రధాని రాష్ట్రానికి వస్తుండటంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.