AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో కోస్తా జిల్లాల్లో 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, NTR, తూ.గో. జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన, మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.